బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ను పాకిస్తాన్ ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించింది. ఇటీవల సౌదీ అరేబియాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన.. పాకిస్తాన్, బలూచిస్తాన్ అంటూ వేర్వేరుగా ప్రస్తావించారు. దీంతో పాక్ ప్రభుత్వం.. ఉగ్రవాద నిరోధక చట్టం కింద సల్మాన్ను ఉగ్రవాదిగా ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. కాగా, సల్మాన్ చేసిన వ్యాఖ్యలను బలూచ్ వేర్పాటు వాదులు స్వాగతిస్తున్నారు.