VSP: వైద్య కాలేజీలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరణ చేయడాన్ని అడ్డుకోవాలని మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సౌత్ ఇంఛార్జ్ వాసుపల్లి గణేష్ కుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు. కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు. 34వ వార్డులో ఆదివారం జరిగిన సంతకాల సేకరణ కార్యక్రమంలో వాసుపల్లి పాల్గొని మాట్లాడారు.