VZM: విజయనగరం బీజేపీ పార్టీ కార్యాలయంలో ఈరోజు జిల్లా అధ్యక్షులు ఉప్పలపాటి రాజేష్ వర్మ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వం పీపీపీ విధానంలో మెడికల్ కళాశాల నిర్మాణాలకు శ్రీకారం చుట్టిందని, ఈ విధానంపై ఆవాస్తవాలు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రెడ్డి పావని, కుసుమంచి సుబ్బారావు పాల్గొన్నారు.