ADB: భీంపూర్ మండలంలోని కమటివాడ గ్రామపంచాయతీ న్యూ గోవిందాపూర్ గ్రామ సమీపంలో వంతెన లేక రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ఈ సందర్భంగా గ్రామస్థులందరూ ఏకమై ఎడ్ల బండి సహాయంతో మొరాన్ని తెచ్చి వాగులో వంతెన నిర్మాణం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అధికారులు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్థులు కోరారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్, సుదర్శన్, రమేష్, మహేందర్, తదితరులున్నారు.