NGKL: రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలలో పాల్గొనే ఉమ్మడి జిల్లా జట్టుకు కల్వకుర్తి పట్టణంలో వారం రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నట్లు ఖోఖో అసోసియేషన్ జిల్లా నాయకులు గోకమల్ల రాజు తెలిపారు. రాష్ట్రస్థాయిలో సత్తా చాటేందుకు క్రీడాకారులకు ఈ ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. శిక్షణకు ఏర్పాట్లు అన్నీ పూర్తయినట్టు ఆయన తెలిపారు.