WNP: ఉమ్మడి జిల్లా ప్రజల కొంగుబంగారం కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల్లో ఆదివారం ఆత్మకూరులోని ఎస్బీఐ బ్యాంకులో ఉన్న స్వామివారి స్వర్ణాభరణాల ఊరేగింపు వైభవంగా సాగింది. రాష్ట్ర పశు సంవర్ధక, క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆభరణాల ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజలు భారీ ఎత్తున హాజరయ్యారు.