కోనసీమ: కాట్రేనికోన మండలం బలుసుతిప్ప గ్రామంలో ఉన్న తుఫాను పునరావాస కేంద్రాన్ని కలెక్టర్ మహేష్ కుమార్ ఆదివారం పరిశీలించారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో జిల్లాపై తుఫాను ప్రభావం ఉన్న నేపథ్యంలో అధికారులు చేపట్టాల్సిన సహాయక చర్యల గురించి అధికారులకు సూచనలు చేశారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.