NLR: ఏఎస్ పేట మండలంలోని హసనాపురం- కలిగిరి మార్గం మధ్యలో కావలి ఎడవల్లి వద్ద ఉన్న ప్రధాన రహదారి బ్రిడ్జి కూలిపోయే స్థితిలో ఉంది. వాహనదారులు భయాందోళనల మధ్య ప్రయాణిస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి, ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే పెను ముప్పు సంభవించవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.