SDPT: తొగుట మండలం ఎల్లారెడ్డిపేట క్లస్టర్ ఏఈవో నాగార్జున రైతునేస్తం అవార్డు పొందారు. వ్యవసాయ సేవలకు గౌరవంగా రైతునేస్తం పురస్కారం ప్రదానం చేశారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా హైదరాబాద్ ముచ్చింతల్ స్వర్ణ భారత్ ట్రస్టులో ఈ అవార్డు ప్రదానం చేశారు. ఎనిమిదేళ్ల కృషికి అవార్డు లభించిందని ఏఈవో తెలిపారు.