ATP: జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 29న జరగాల్సిన జిల్లాస్థాయి ప్రభుత్వ ఉద్యోగుల క్రీడా పోటీలు వాయిదా వేసినట్లు డీఎస్ డీవో మంజుల ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో తుపాను ప్రభావితం కావడం వల్ల ఈ పోటీలు వాయిదా వేసినట్లు వివరించారు. పోటీల తేదీలను త్వరలో ప్రకటిస్తామన్నారు.