NZB: జిల్లా సీసీఎస్ కానిస్టేబుల్ హత్య కేసు నిందితుడు రౌడీషీటర్ రియాజ్‌ను పట్టుకోవడంలో సహాయం చేసి, తీవ్ర గాయాలపాలైన సయ్యద్ అసీఫ్ను రాంనగర్ కాలనీలో ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణతో కలిసి ఎంపీ అర్వింద్ సోమవారం రాత్రి పరామర్శించారు. ప్రాణాలకు తెగించి రియాజ్‌ని పట్టుకున్నందుకు అసిఫ్‌ను అభినందించారు. అనంతరం ఎంపీ, ఎమ్మెల్యే కలిసి రూ.50వేల ఆర్థిక సహాయం అందించారు.