VSP: విశాఖలో బుధవారం కూడా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ మంగళవారం ఈ విషయాన్ని తెలియజేశారు. మంగళవారం అర్ధరాత్రి తర్వాత తుఫాను తీరం దాటే సమయంలో వర్ష తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యలో భాగంగా పాఠశాలలకు, కళాశాలలకు సెలవు ప్రకటించినట్లు ఆయన వెల్లడించారు.