NZB: ఆలూర్ మండలంలోని మచర్ల గ్రామానికి చెందిన బీజేపీ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి లోక రామ్ రెడ్డి కుమార్తె నవ్య రెడ్డి ఇటీవల ఆకస్మికంగా మృతి చెందిన ఘటనపై పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ మంగళవారం కుటుంబాన్ని స్వయంగా పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, నవ్య రెడ్డి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.