SRPT: అకాల వర్షాలు రైతులు ఉసురుతీస్తున్నాయి. ఆరుగాలం కష్టించి లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి పండించిన పంటలు చేతికందే సమయంలో ప్రకృతి ఆగ్రహానికి గురై నీటి పాలవుతున్నాయి. కోదాడ నియోజకవర్గంగా గత మూడు రోజుల నుంచి కురుస్తున్న ఈ వర్షానికి కోతకొచ్చిన వరి పంట నేలమట్టమై, వరి వెన్నులు నీటి పాలయ్యాయి. ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని రైతులు కోరారు.