BPT: బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ రూమ్‌ను దక్షిణ కోస్తాంధ్ర ప్రత్యేక అధికారి ఆర్.పి. సిసోడియా మంగళవారం పరిశీలించారు. జిల్లాలో తుఫాను ప్రభావం పంట కాల్వలలో ప్రవాహం పునరావాస కేంద్రాల ఏర్పాటు చేపడుతున్న సహాయక చర్యలపై జిల్లా ప్రత్యేక అధికారి వేణుగోపాల్ రెడ్డి జిల్లా కలెక్టర్ వై. వినోద్ కుమార్ సిసోడియాకి వివరంగా నివేదిక అందజేశారు.