BPT: మొంథా తుపాన్ నేపథ్యంలో సంతమాగులూరు మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రత్యేక పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తహశీల్దార్ కె. రవిబాబు తెలిపారు. మంగళవారం ఆయన ఏల్చూరు జడ్పీహెచ్ఎస్ స్కూలులోని పునరావాస కేంద్రాన్ని పరిశీలించారు. 50 మందికి షెల్టర్ కల్పించామన్నారు. కుందుర్రులో 30 మందిని శిబిరానికి తరలించారు.