BDK: కొత్తగూడెం సుదీర్ఘ కాలంపాటు గ్రంథాలయ గ్రేడ్ 2 ఉద్యోగగా విధులు నిర్వహించి గత కొంతకాలం క్రితం పదవీ విరమణ పొందిన అమరేంద్ర కోటేశ్వరరావు జిల్లా గ్రంథాలయానికి గ్లాస్ నోటీస్ బోర్డ్ వితరణగా అందజేశారు. ఆ నోటీస్ బోర్డును మంగళవారం గ్రంథాలయ ఛైర్మన్ వీరబాబుకు అందజేశారు. ఈ వితరణ సమాజంలో పలువురికి ఆదర్శంగా నిలవడంతో పాటు విలువలను మరింత పెంచుతాయని చెప్పారు.