SRD: పుల్కల్ మండలం సింగూర్‌కు ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షానికి 5 వేల క్యూసెక్కులు వరద ప్రాజెక్టులో వచ్చి చేరుతున్నట్లు AEE మహిపాల్ రెడ్డి నేడు తెలిపారు. ప్రాజెక్టు లిమిట్ స్థాయిని పరిశీలించి, ఏ సమయంలోనైనా ఇవాళ ప్రాజెక్టు గేట్లు ఓపెన్ చేసి దిగువకు మంజీరా నదిలో వరద నీరు వదిలే అవకాశం ఉందన్నారు. నది తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.