AP: ‘మొంథా’ తుఫాన్ ఇవాళ రాత్రి 11 గంటలకు అమలాపురం వద్ద తీరం దాటే అవకాశం ఉన్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ తుఫాన్ ప్రభావం దాదాపు 40 లక్షల మందిపై ఉండనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. తుఫాన్ నేపథ్యంలో రాష్ట్రానికి అండగా ఉంటామని ప్రధాని మోదీ చెప్పినట్లు వెల్లడించారు. అవసరమైతే ఆర్మీని రంగంలోకి దింపుతామని లోకేష్ స్పష్టం చేశారు.