ATP: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఈనెల 30న అనంతపురానికి రానున్నారు. మాజీ ఎమ్మెల్సీ దేవిరెడ్డి సూర్యప్రకాశ్ రెడ్డి 36వ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొంటారని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ రెడ్డి తెలిపారు. దేవిరెడ్డి జీవిత పుస్తకాన్ని మాధవ్ ఆవిష్కరిస్తారని వెల్లడించారు. అనంతపురంలోని జీఆర్ గార్డెన్లో ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.