కృష్ణా: తుఫాను ప్రభావంతో నీటి మట్టం పెరగడంతో రహదారులు ప్రమాదకరంగా మారుతున్న నేపథ్యంలో కృత్తివెన్ను ఎస్సై ఈరోజు తక్షణ చర్యలు చేపట్టారు. ఇంతేరు నుంచి సత్రంపాలెం గ్రామం మధ్య ఉన్న రోడ్డు పాక్షికంగా దెబ్బతిని ప్రమాదకరంగా మారినందున, ప్రజల రాకపోకలకు అంతరాయం కలగకుండా, నీటి తాకిడికి మరింత రోడ్డు పాడవకుండా జాగ్రత్త చర్యగా ఇసుక సంచులతో బలపరిచారు.