BDK: మణుగూరు పరిధిలో గల వలస ఆదివాసి గిరిజన గ్రామమైన విప్పల గుంపు లో వైద్యులు మంగళవారం హెల్త్ క్యాంప్ నిర్వహించారు. అనంతరం షుగర్, బీపీ పరీక్షలు చేసి మందులు ఇవ్వడం జరిగింది. గ్రామంలో ప్రతి ఇంటిని సందర్శించి, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. నీటి నిల్వలు లేకుండా చేసుకోవాలని తెలియజేసి లార్వా ఉన్న కంటైనర్లు తొలగించడం జరిగింది.