GNTR: పాతగుంటూరు మెయిన్ రోడ్డులోని ఆంజనేయస్వామి గుడి సమీపంలో సోమవారం సాయంత్రం చైన్‌స్నాచింగ్ జరిగింది. ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న కోట రంగమ్మ అనే మహిళ మెడలో ఉన్న గొలుసును ఆగంతకులు దొంగిలించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.