ప్రకాశం: వెలిగండ్ల మండలంలోని పందువ గ్రామం వద్ద ఉన్న పందువ గండి రిజర్వాయర్ వద్ద సోమవారం నీటి సంఘం అధ్యక్షులు వెంకటేశ్వర్లు గేట్లకు గ్రీస్‌తో మరమ్మతులు చేపట్టారు. మొంథా తుఫాను నేపథ్యంలో అధికంగా వర్షాలు పడి రిజర్వాయర్ నిండితే గేట్లు ఎత్తేందుకు సులువుగా ఉంటుందని గ్రామస్తులతో కలిసి చర్యలు చేపట్టారు. తుఫాను పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.