ATP: రాష్ట్రంలోని ‘మొంథా’ తుపాను ప్రభావిత ప్రాంతాలకు అనంతపురం జిల్లా నుంచి 175, శ్రీ సత్యసాయి జిల్లా నుంచి 150 మంది విద్యుత్ శాఖ సిబ్బందిని పంపించారు. వారి వాహనాలను ఎస్ఈలు శేషాద్రిశేఖర్, సంపత్‌కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. విద్యుత్ సరఫరా నిలిచినా వెంటనే పునరుద్ధరించేందుకు సిబ్బందిని సిద్ధంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు.