MNCL: భీమారం మండలంలో పత్తి సాగు చేసిన రైతులు ఏరిన పత్తిలో తేమ శాతం ప్రభుత్వ నిబంధనల మేర ఉంటేనే CCIకి తీసుకెళ్లాలని MAO సుధాకర్ కోరారు. మంగళవారం మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద రైతులకు కపాస్ కిసాన్ యాప్ ద్వారా పత్తి అమ్మకాలపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. పత్తిలో తేమ శాతం 8-12 % ఉన్న పత్తిని మాత్రమే అమ్మడానికి CCIకి తీసుకెళ్ళాలన్నారు.