MHBD: గార్ల మండల నూతన ఎస్సైగా మంగళవారం సాయికుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనను స్టేషన్ సిబ్బంది, పలువురు నేతలు శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. శాంతిభద్రతలు, నేర నియంత్రణకు ప్రజల సహకారం అవసరమని, భాగస్వామ్యంతో మెరుగైన సేవలు అందిస్తామని పేర్కొన్నారు.