కృష్ణా: మొంథా తుఫాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలు చేపట్టి సిద్ధంగా ఉన్నామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నం కలెక్టరేట్లో పర్యాటక శాఖ ఎండి.ఆమ్రపాలి, జిల్లా కలెక్టర్ బాలాజీతో జిల్లాలో సంభవించనున్న భారీ వర్షాలు, ఈదురు గాలులకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈరోజు చర్చించారు.