RR: చందానగర్ సర్కిల్ పరిధిలోని గంగారం కాలనీలో సుభాష్ నగర్ పేరిట 1974లో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ లేఅవుట్ వేశారు. ఇందులో 700 గజాల స్థలాన్ని అవసరాలకు కేటాయించగా.. కొందరు పాగా వేసి స్థలాన్ని ప్లాట్లుగా మార్చారు. దీంతో స్థానికులు స్థలాన్ని కాపాడాలని హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేయగా… మంగళవారం ఆక్రమణలు తొలగించి ఫెన్సింగ్ వేశారు.