RR: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలలో స్పష్టమైన పురోగతి పెంచాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయం సముదాయం సమావేశ మందిరంలో ఇందిరమ్మ ఇళ్ల పురోగతి, డబుల్ బెడ్ రూమ్ల పంపిణీ ప్రక్రియ, తదితర వాటిపై సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. నిజమైన పేద లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్లను నిర్మాణం చేపట్టేలా చూడాలని సూచించారు.