KRNL: పోలీసులు ఆరోగ్యంగా ఉంటే తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించగలరని ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో మెగా మెడికల్ క్యాంపు, వ్యాస్ ఆడిటోరియం వద్ద రక్తదాన శిబిరాలను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 182 మంది పోలీసులు, వారి కుటుంబ సభ్యులు వైద్య పరీక్షలు చేయించుకున్నారు.