ATP: గుత్తి మండలం తొండపాడు గ్రామంలో గత రెండు రోజుల క్రితం కుటుంబ కలహాల కారణంగా అల్లుడు హరిపై మామ పుల్లన్న కత్తితో దాడి చేశాడు. ఈ దాడి కేసులో నిందితుడు పుల్లన్నను అరెస్టు చేసినట్లు సీఐ రామారావు తెలిపారు. పుల్లన్న వద్ద నుంచి కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.