NZB: జిల్లా జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించబడనున్న చెకుముకి సైన్స్ సంబరాలు 2025 గోడ ప్రతులను జిల్లా కోర్టులో మంగళవారం నిజామాబాద్ డీఎల్ఎస్ఎ సెక్రటరీ, జిల్లా జడ్జి ఉదయ భాస్కర్ ఆవిష్కరించారు. ఈ సైన్స్ టెస్ట్ నవంబర్ 7న పాఠశాల స్థాయి, 21న మండల స్థాయి, 28న జిల్లా స్థాయిలో జరగనుంది. 8, 9,10వ తరగతి విద్యార్థులు ఇందులో పాల్గొనవచ్చని నిర్వాహకులు తెలిపారు.