ASR: కురుస్తున్న భారీ వర్షంతో కొండలపై నుంచి ఉదృతంగా వస్తున్న నీటితో అరకు ఘాటీ రోడ్డు జలమయమై వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. అలాగే ఈ రోజు రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడే సూచన ఉండటంతో అధికారుల ఆదేశాల మేరకు అనంతగిరి మండలం చిలకలగెడ్డ ఫారెస్ట్ చెక్ పోస్ట్ నుంచి అరకులోయ మండలం సుంకరమెట్ట చెక్ పోస్టుల మధ్య మంగళవారం రాత్రి రాకపోకలు నిషేధించారు.