NDL: బనగానపల్లె పట్టణంలో ఈనెల 28న వైసీపీ పార్టీ నిర్వహించబోయే భారీ ర్యాలీ మెంథా తుఫాన్ కారణంగా ప్రస్తుతం వాయిదా పడింది. ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహించబోయే భారీ ర్యాలీ వాయిదా పడినట్లు మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తెలిపారు. తదుపరి తేదీని త్వరలోనే ప్రకటిస్తామని మాజీ ఎమ్మెల్యే అన్నారు.