ATP: విడపనకల్ మండలంలోని ఆదర్శ పాఠశాల బాలికల హాస్టల్ వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలని గుంతకల్లు రెవెన్యూ డివిజన్ ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ హరి ప్రసాద్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన మోడల్ స్కూల్ బాలికల వసతి గృహాన్ని సందర్శించారు. అందుబాటులో వార్డెన్ లేకపోవడంతో అక్కడున్న విద్యార్థులతో హాస్టల్లో అందుతున్న సౌకర్యాల గురించి ఆరా తీశారు.