KMR: వచ్చే డిసెంబర్ నాటికి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా తెలంగాణ నూతన విద్యా విధానాన్ని ప్రకటిస్తామని చెప్పడాన్ని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్ రెడ్డి ఆదివారం ఖండించారు. ఉపాధ్యాయ సంఘాలతో చర్చించకుండా నూతన విద్యా విధానాన్ని ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. ప్రకటన చేసేముందు సంఘాలతో చర్చించాల్సిందేనని పేర్కొన్నారు.