WGL: నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని మహేశ్వరంలో ఆదివారం రెండు ఇళ్లలో చోరీ జరిగింది. తాళాలు వేసి ఉన్న ఇంటి తలుపులు పగలగొట్టి గుర్తుతెలియని వ్యక్తులు బంగారం, నగదును చోరీ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సాక్ష్యాలు సేకరించారు. ఫింగర్ప్రింట్లు, సీసీ కెమెరాలు పరిశీలించి దర్యాప్తు కొనసాగుతోంది.