ADB: పుస్తకాలు చదవడం ద్వారా ఆలోచనాశక్తి, జ్ఞానాభివృద్ధి పెరుగుతాయని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఆదివారం స్థానిక గాంధీ పార్క్లో నిర్వహించిన ‘పుస్తక పఠనం చేద్దాం’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ రాజర్షి షా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రంథాలయాల్లో ఎన్నో విలువైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.