ELR: ‘మొంథా’ తుఫాన్ ప్రభావంతో జిల్లాలో అక్టోబర్ 27, 28వ తేదీల్లో పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీలకు సెలవు ప్రకటించారు. తుఫాన్ కారణంగా తీవ్ర గాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ వెట్రి సెల్వి ఆదివారం తెలిపారు. ప్రైవేట్ యాజమాన్యాలు అదనపు తరగతులు లేదా స్టడీ క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.