ప్రకాశం: కనిగిరిలోని కొండపై కొలువైన శ్రీ విజయ మార్తాండేశ్వర స్వామి సన్నిధిలో శివ స్వాముల సేవాసమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అయ్యప్ప, ఆంజనేయ, సుబ్రహ్మణ్య ,శివ స్వాములకు స్వయంగా ఎమ్మెల్యే అన్నదానం చేశారు. మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్ గఫార్ పాల్గొన్నారు.