KKD: తుఫాను నేపథ్యంలో ఈనెల 27 నుంచి 31వ తేది వరకు జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు కాకినాడ కలెక్టర్ షాన్మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ హాస్టళ్లలో ఉండే విద్యార్థులు 26వ తేది సాయంత్రం నాటికి ఇళ్లకు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ ఐదు రోజులు ఏ ఒక్క విద్యాసంస్థ తెరిచి ఉండకూడదన్నారు.