కృష్ణా: మొంథా తుపాన్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అమెరికా పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గుడివాడలోని అధికార యంత్రాంగంతో జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈరోజు సమావేశమయ్యారు. మున్సిపల్, రెవెన్యూ, వ్యవసాయ శాఖ, మండల పరిషత్ ప్రభుత్వ శాఖల అధికారులను ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అధికారంలో అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు.