TG: తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వడ్డెర సంఘం నేతలతో భేటీ అయ్యారు. మాయమాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, పేదల ఇళ్లు కూల్చడం తప్ప చేసిందేమీ లేదని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో మరోసారి మోసం చేయబోతున్నారని, కంటోన్మెంట్ ఉప ఎన్నికలో పనిచేసిన మంత్రులు జూబ్లీహిల్స్లో కనిపించడం లేదన్నారు. KCR కుల, మత రాజకీయాలు చేయలేదన్నారు.