VZM: సంతకవిటి మండలం గుళ్ళ సీతారామపురంలో కొర్ణన ఢిల్లేశ్వరి (దేవి)ని వీధి కుక్క కరిచినట్లు తల్లి రాము తెలియజేసింది. శనివారం ఆమె కుమారుడిని ఇదే కుక్క కరిచింది. ఆదివారం ఢిల్లేశ్వరి బ్రష్ చేస్తుండగా రెండు కాళ్లు, తొడలపై తీవ్రంగా కరిచిందని చెప్పారు. ఈ గ్రామంలో వీధి కుక్క బెడద ఎక్కువగా ఉందని చెబుతున్నారు.