VZM: బొబ్బిలి గురుకుల పాఠశాల రూపురేఖలు మారుస్తామని ఎమ్మెల్యే బేబినాయన అన్నారు. బొబ్బిలి పట్టణం సమీపంలో ఉన్న గురుకుల పాఠశాలలో పూర్వ విద్యార్థులు చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఆదివారం ప్రారంభించారు. పూర్వ విద్యార్థుల స్ఫూర్తితో పాఠశాలను దత్తత తీసుకున్నట్లు చెప్పారు. పాఠశాల అభివృద్ధికి నిధులు మంజూరుకు ప్రతిపాదనలు చేశామన్నారు.