NDL: రుద్రవరం మండలం ముత్తులూరు గ్రామ సమీపంలో అకాల వర్షాలకు దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల విజయేంద్రరెడ్డి ఆదివారం పరిశీలించి రైతులను పరామర్శించారు. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరతో మొక్కజొన్న పంటను కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వినర్ ప్రసాద్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.