VZM: ముంథా తుఫాన్ ప్రభావంతో ఈ నెల 27,28,29న భారీ వర్షాలు కురిసి అవకాశం ఉన్న నేపథ్యంలో వరి పంట కోత దశకు వస్తే కోతలు వాయిదా వేసుకోవాలని తెర్లాం మండల వ్యవసాయ అధికారి బొత్స శ్రీనివాసరావు ఆదివారం సూచించారు. వర్షాలకు పంట నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఇప్పటికే కోతలు జరిగితే కుప్పలు వేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.