బాలీవుడ్ నటి అలియాభట్, శార్వరి వాఘ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘ఆల్ఫా’. ఈ సినిమాలో స్టార్ హీరో షారుఖ్ ఖాన్ భాగం కానున్నట్లు తెలుస్తోంది. ‘పఠాన్’ తరహా పాత్రతో షారుఖ్ మెరవనున్నట్లు టాక్. ఆయన కూడా ఇందుకు ఒప్పుకున్నారట. ఇక స్పై యాక్షన్ జానర్లో రాబోతున్న ఈ చిత్రాన్ని యష్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తుండగా.. శివ్ రావేల్ తెరకెక్కిస్తున్నారు.