WGL: నగర అభివృద్ధికి ప్రభుత్వం రూ.50 కోట్ల నిధులు మంజూరు చేసింది. సీఎం రేవంత్ రెడ్డికి మేయర్ సుధారాణి కృతజ్ఞతలు తెలిపారు. నిధుల మంజూరుకు సహకరించిన జిల్లా ఇంఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం సలహాదారుడు వేం నరేంద్ రెడ్డి, మంత్రులు కొండా సురేఖ, సీతక్క, MLAలు రాజేందర్ రెడ్డి, నాగరాజు, శ్రీహరిలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.